లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరమ్మతుకు అవసరమైన నిధుల మంజూరుకు తన వంతుగా కృషి చేస్తానని డీఈవో భోజన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పాఠశాల దుస్థితిని వివరించారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని , అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలను పరిశీలించారు. కొన్ని గదులు భాగుండటంతో చిన్న చిన్న మరమత్తులు చేయడానికి అవసరమైన నిధుల కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు అయ్యేలాగా కృషి చేస్తానన్నా రు. అలాగే అసంపూర్తిగా ఉన్న భవనం నిర్మా ణం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ పనులు రద్దు చేయించి మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నా రు. ఆయన వెంట సర్పంచ్ ఓస కవిత, బీజేపీ మండల అధ్యక్షుడు గాండ్ల చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేశ్, మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు వోస రాజు, రాజేశ్వర్, బాలు తదితరులు ఉన్నారు.


