● జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జమంద్ అలీ
నిర్మల్‌చైన్‌గేట్: పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పుస్తక ప్రదర్శనను డీఈవో భోజన్నతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాలను మరింత ఆధునికీకరిస్తామని తెలిపారు. పాఠశాలల్లో గ్రంథాలయాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.


