ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవాలు

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● ఆరోగ్యం, సాంకేతికత, సాంస్కృతిక ప్రదర్శనలు

బాసర: బాసర రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటి)లో విద్యా వారోత్సవాలు ఐదోరోజు శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, సాంకేతిక సహాయం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం ఆరోగ్యకరమైన రాగి జావను పంపిణీ చేశారు. ఎస్‌ఏసీ ఆవరణలో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ పాల్గొని, పని ఒత్తిడితో ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దని, పౌష్టికాహారం ముఖ్యమని సిబ్బందికి సూచించారు. ఈ వేడుకల్లో ప్రధాన అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఎన్‌.భవాని పాల్గొన్నారు. డీబీఎస్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఆర్థిక సహకారంతో నిర్మాణ్‌ స్వచ్ఛంద సంస్థ 100 లాప్‌టాప్‌లను అందజేసింది. ఎన్‌. భవాని మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చితే గ్రామీణ విద్యార్థులు అద్భుతాలను సృష్టిస్తారని, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వారి వారు శాశ్వతంగా సహకరించనున్నట్టు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..

మధ్యాహ్నం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తమలోని కళాత్మక కో ణాన్ని ఆవిష్కరించారు. డాక్టర్‌ కొత్తపల్లి రాములు, డాక్టర్‌ ఆర్‌.అజయ్‌ కుమార్‌, డాక్టర్‌ బి.బాలకృష్ణ పద్యాలు వినిపించారు. బి.వజ్రాంశు, సురేశ్‌ వీణ నాదం.. కె.స్రవంతి, రాయల సతీష్‌ బృందం ఆలపించిన గీతాలు, భార్గవ్‌, నవీన్‌ కుమార్‌, నాగలక్ష్మి బృందాల ప్రదర్శనలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్‌ ఈ. మురళీ దర్శన్‌, ఐఆర్‌ఎస్‌ అధికా రులు వి.సుధాకర్‌, పీవీ.జైకిరణ్‌, డీబీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కళ్యాణ్‌, నిర్మాణ్‌ సంస్థ ప్ర తినిధి అనురాధ పుల్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement