నిర్మల్‌చైన్‌గేట్: ముందస్తు అప్రమత్తతతో విపత్కర సమయాల్లో నష్టం నివారించవచ్చని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను ఎదుర్కునేందుకు సన్నద్ధతపై నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ వివరాలను కేంద్ర పర్యావరణ విపత్తు సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ డైరెక్టర్ నుంచి మేజర్ జనరల్ సుధీర్ బేహాల్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హరిచందన దాసరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఈనెల 18న వైఎస్సార్ కాలనీలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేలా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు భాగస్వామ్యమవ్వాలన్నారు. ముందస్తు సన్నద్ధతతో ప్రజల్లో విపత్కర పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. వీసీలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, సీపీవో జీవరత్నం, డీఎంహెచ్‌వో రాజేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గోదాములను పరిశీలించిన కలెక్టర్


