కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

మామడ/లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని బీజెఏల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మామడ మండలం పరిమండల్‌, లక్ష్మణచాంద మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రైతుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. ఎంపీ నగేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. పరిమండల్‌లో రూ.20 లక్షలతో ఎస్‌హెచ్‌జీ వీవో భవనం, రూ.20 లక్షలతో ఎస్‌హెచ్‌జీ వీవో వర్కింగ్‌షెడ్‌ నిర్మాణం ప్రారంభించారు. పాఠశాలలో రూ.13.50 లక్షలతో నిర్మించిన సైన్స్‌ల్యాబ్‌ను ప్రారంభించారు. లక్ష్మణచాంద, న్యూసాంగ్వి కేజీబీవీల్లో రూ.38 లక్షలతో వేర్వేరుగా నిర్మించే రెండు అదనపు గదులు, మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. మామడ, లక్ష్మణచాంద రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీఈవో భోజన్న, డీఈ గంగాధర్‌, కేజీబీవీ ఎస్‌వోలు జ్యోతి, నవిత, ఏఈ ఆంజనేయులు, తహసీల్దార్లు శ్రీనివాస్‌రావు, సరిత, ఎంపీడీవో గంగాసాగర్‌రెడ్డి, ఎంఈవో వెంకటరమణరెడ్డి, లక్ష్మణచాంద సర్పంచులు కవిత, అశ్విన్‌రెడ్డి, లయశ్రీమల్లేశ్‌, చంద్రకళసురేందర్‌, రాజేశ్వర్‌, లక్ష్మి, జంగిలి రాజవ్వమల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు రావుల రాంనాథ్‌, బాపురెడ్డి, రాజారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అడ్వాల రమేశ్‌, ఓస రాజు, బొమ్మెన రవి, ముత్యంరెడ్డి, రమణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement