విజయాలను ఆస్వాదించాలి | - | Sakshi
Sakshi News home page

విజయాలను ఆస్వాదించాలి

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

● వైఫల్యాలను పాఠాలుగా మార్చుకోవాలి ● మోటివేషనల్‌ స్పీకర్‌ విజయ్‌కుమార్‌

బాసర: బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో విద్యా వా రోత్సవాలు కొనసాగుతున్నాయి. నాణ్యమైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం అందించే లక్ష్యంతో గురువా రం కీలక కార్యక్రమాలు, విభాగాలు ప్రారంభించా రు. మోటివేషనల్‌ స్పీకర్‌ విజయ్‌కుమార్‌ ’సక్సెస్‌ అండ్‌ ఫెయిల్యూర్స్‌’ అంశంపై స్ఫూర్తి ఉపన్యా సం ఇచ్చారు. విజయాలను వినయంతో ఆస్వాదించా లి, వైఫల్యాలను పాఠాలుగా మలిచి ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌ ఏఐ సాంకేతికతలపై అధ్యాపకులు నిరంతర అవగాహన పెంచుకోవాలని సూ చించారు. ఓఎస్డీ ప్రొఫెసర్‌ మురళీ దర్శన్‌ వైఫల్యాన్ని అభివృద్ధికి బాటగా మార్చుకోవాలన్నారు.

ఐఐటీ రూర్కీతో ఎమ్‌ఓయూ

ఐఐటీ రూర్కీ ఇంక్యుబేషన్‌ సెల్‌తో రెండేళ్ల అవగా హన ఒప్పందం కుదిరింది. పరిశోధన, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, ఇంటర్న్‌షిప్‌లకు అవకాశాలు తలెత్తనున్నాయి. జాతీయస్థాయి అకడమిక్‌ సహకారం ఏర్పడుతుంది. పూర్వ విద్యార్థులతో అనుసంధానానికి ’అలుమ్ని కనెక్ట్‌’ వెబ్‌సైట్‌ను ఇన్‌చార్జి వీసీ ప్రారంభించారు. కెరీర్‌ సలహాలు, ఉద్యోగ సమాచారం, మార్గదర్శకత్వం పొందేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ ప్రణాళికలకు ’కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌’ ఏర్పాటు చేశారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉద్యోగాలపై మార్గనిర్దేశం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా వారోత్సవాల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.దేవరాజు, అసోసియేట్‌ డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement