చేపల వేటలో గొడవ | - | Sakshi
Sakshi News home page

చేపల వేటలో గొడవ

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

లక్ష్మణచాంద: పీచరలో చేపల వేట ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. మండలంలోని పీచరలో బ్రహ్మణి చెరువులో గ్రామానికి చెందిన ఓ వర్గం వారు గురువారం చేపలు పట్టుతుండగా, మరో వర్గంవారు తాము పడతామంటూ చెరువులోకి దిగే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్యన గొడవ జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో లక్ష్మణచాంద ఎస్సై శ్రావణి, సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి, సోన్‌ ఎస్సై గోపి బ్రహ్మణి చెరువు వద్దకు చేరుకున్నారు. సీఐ గోవర్ధన్‌రెడ్డి ఇరు వర్గాలతో మాట్లాడి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పించారు. ఇరువర్గాల వారు చెరువులలో చేపలు పట్టుకునే హక్కు తమకు ఉందంటే తమకు ఉందంటూ సీఐకి తెలిపారు. ఇరుర్గాల వారిని ఒప్పించి అందులో నుంచి ఒక వర్గం వారు వెళ్లేలాగా చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement