లక్ష్మణచాంద: వరి కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని రాచాపూర్ రైతులు మండల కేంద్రంలో గురువారం ఆందళోన చేపట్టారు. రాచా పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగో ళ్లు చేయడం లేదని నిరసన తెలిపారు. గన్నీ సంచులు సకాలంలో ఇవ్వడం లేదని తెలిపారు. గన్నీ సంచులు ఇచ్చినా హమాలీలు లేక తూకం వేయడం లే దని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలోనూ జాప్యం చేస్తున్నారని వెల్లడించారు. సంచులు లోడింగ్ చేసే సమయంలో ఒక సంచికి రూ.10 వసూలు చేస్తున్నారని దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చిన హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేదని లే దని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రెండు గంట లు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకు న్న ఎస్సై శ్రావణి, డీటీ బాబుసింగ్ రైతులతో మా ట్లాడారు. తహసీల్దార్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేదని చెప్పారు. సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సై గోపి వచ్చి రైతులతో మాట్లాడి తమ వెంట వస్తే లారీలు పంపుతామని చెప్పినా రైతులు ఆందోళన విరమించలేదు. చివరకు తహసీల్దార్ సరిత వచ్చి రైతులతో మాట్లాడారు. సరిపడా గన్నీ సంచులు తెప్పిస్తామని, అదనంగా మరో కాంటా ఏర్పా టు చేస్తామని, హమాలీలను పంపుతామని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. కేంద్రం వద్ద ఎలాంటి సమస్య ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. దీంతో ఆందోళన విరమించారు. ఇందులో సర్పంచ్ మహేశ్, మాజీ సర్పంచ్ పోశెట్టి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, రైతులు పోశెట్టి, ముత్యం, నవీన్, హరీశ్, నారాయణ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
108కు దారిచ్చిన రైతులు
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న సయంలో 108 అంబులెన్స్ అటుగా వచ్చింది. వెంటనే రైతులు వాహనాలను తప్పించడంతోపాటు అంబులెన్స్ వెళ్లేలా దారి ఇచ్చారు.
గన్నీ సంచుల కోసం..
పెంబి: మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని, తూకం వేయడం ఆలస్యం అవుతోందని, గన్నీ సంచులు ఇవ్వాలని రైతులు బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేంద్రంలో 50 వేల సంచులకు సరిపడా మక్కలు ఉన్నాయని తెలిపారు. సంచులు సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అకాల వర్షాలకు మక్కలు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


