ఆమెకు మరింత ఆర్థిక శక్తి | - | Sakshi
Sakshi News home page

ఆమెకు మరింత ఆర్థిక శక్తి

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

● వడ్డీ లేని రుణ పరిమితి పెంపు ● మహిళలకు మరింత మేలు ● హర్షం వ్యక్తం చేస్తున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు

లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. వడ్డీ లేని రుణ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇది మహిళలకు ఎంతో ఉపయోగం.

కార్యక్రమ లక్ష్యాలు..

ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు బ్యాంకు లింకేజ్‌, సీ్త్రనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. పశుపోషణ, కోళ్ల పెంపకం, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తూ మారుమూల మహిళలు స్వావలంబన పొందేలా చూస్తోంది. ఇది కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది.

జిల్లా పురోగతి..

2025–26 ఆర్థిక సంవత్సరం లక్ష్యం 9,859 సంఘాలకు రూ.487.79 లక్షలు కాగా, 5,073 సంఘాలకు రూ.489.40 లక్షలు అందించారు. లక్ష్యం మించి రుణాలు అందించారు. ఇక 2026–27 ఆర్థిక సంవత్సరానికి 10,825 సంఘాలకు రూ.503.36 లక్షల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదివరకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా సమాచారం..

మండల సమాఖ్యలు 19

గ్రామైక్య సంఘాలు 12,185

స్వయం సహాయక సంఘాల సభ్యులు 1,37,910

Advertisement
 
Advertisement
Advertisement