బుద్ధుని బోధనలు అనుసరించాలి | - | Sakshi
Sakshi News home page

బుద్ధుని బోధనలు అనుసరించాలి

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

● పూజ్యభంతే నగ్‌వజ్రే

తానూరు: ప్రతి ఒక్కరూ బుద్ధుని బోధనలు అనుసరించాలని పూజ్యభంతే నగ్‌వజ్రే అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మండలంలోని ఝరి(బి) గ్రామంలో నూతనంగా నిర్మించిన బుద్ధవిహార్‌ను శుక్రవారం ప్రారంభించారు. బుద్ధుని చరిత్ర వివరించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించిన 22 ప్రతిజ్ఞను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదవులు చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నిత్యం బుద్ధవిహార్‌లో బుద్ధవందన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహాసభ కేంద్రియ శిక్షక్‌లు అబారావ్‌, అనితతాయి, నారయాణ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌రావ్‌ పటేల్‌, నాయకులు శంకర్‌, బౌద్ధ దీక్షాపరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement