నిర్మల్‌చైన్‌గేట్: బైంసా పట్టణంలో గురువారం జరిగిన కోఆప్షన్ ఎన్నిక సమయంలో బీజేపీ కౌన్సిలర్ అల్లం లక్ష్మిని బెదిరించి ఎంఐఎం కౌన్సిలర్లు గందరగోళానికి గురిచేశారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తత్రి, వైస్ చైర్మన్ బీబీ కూతిజా సిద్దిఖి, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు కలెక్టర్ భవేశ్‌మిశ్రాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో జరిగిన అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కోఆప్షన్ ఎన్నిక జరిగిన తీరును వివరించారు. కోఆప్షన్ ఎన్నిక మరల నిర్వహించాలని తెలిపారు.


