నిర్మల్‌చైన్‌గేట్: నవ సమాజానికి పునాది వేసే కేంద్రాలు అంగన్‌వాడీ సెంటర్లు. కానీ మూడేళ్లుగా సి బ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. ఫలితంగా చిన్నారులకు సమయానికి పోషకాహారం అంద క, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కారణంగా కేంద్రాలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలు కాగితా లకే పరిమితమవుతున్నాయి. టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నచోట ఆయాలే కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మ రోవైపు 60 ఏళ్లు నిండిన వారు ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీలు పెరుగుతున్నాయి. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయా పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి.
ప్రాజెక్టుల వారీగా ఇలా....
జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 926 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. భైంసా, ఖానాపూర్, ము ధోల్, నిర్మల్ ప్రాజెక్టుల పరిధిలో కలిపి 82 టీచర్ పోస్టులు, 440 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో టీచర్లు, ఆయాలు లేక గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. సెంటర్లలో సిబ్బంది కొరత ఏర్పడిన తర్వాత ఇన్‌చార్జీలతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, సరైన రీతిలో నడవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
జిల్లాలో 931 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలోని 18 మండలాలు, నాలుగు మున్సిపాలిటీ ల పరిధిలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 932 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో ప్రస్తుతం గర్భిణులు 56,854 మంది, బాలింతలు 4,073 మంది ఉన్నారు. 6 నెలలలోపు చిన్నారులు 4,265 మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,560 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 27,919 మంది ఉన్నారు.
టీచర్లు, హెల్పర్లే కీలకం..
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు హెల్పర్లదే కీలకపాత్ర. టీచర్‌కు నెలకు రూ.13,650. ఆయాకు రూ.7,800 గౌరవ వేతనంగా అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఈ వేతనాలు కొంత మేరకు ఊరటనిచ్చే విధంగా ఉన్నప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో సరిపోవడం లేదంటున్నారు. ఆంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ పాలు, కోడిగుడ్డుతోపాటు ఆకుకూరలు, ఇతర కూరలతో పౌష్టికాహారం సక్రమంగా అందుతుంది. ఆరోగ్య సర్వేలు, ఇతర సర్వేల బాధ్యతలను ఎక్కువగా టీచర్లకే అప్పగిస్తుంటారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్కన ఉండే కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతుంది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తున్నారు. వాళ్లకు సర్వే బాధ్యతలు అప్పగించినప్పుడు కేంద్రాలు త్వరగా మూత పడుతున్నాయి. శుక్రవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మొదలవుతున్నాయి. జూన్ 1న పునఃప్రారంభమవుతాయి. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
ఇన్‌చార్జీలను నియమించాం..
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయాపోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల స్థానంలో ఇన్‌చార్జీ లను నియమించాం. పో స్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మంజూరు అయిన వెంటనే భర్తీ చేస్తాం.
– వినూత్న,
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి


