కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

కల్యాణ మండపంలో లక్ష్మీనృరసింహస్వామి ఉత్సవమూర్తులు

దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను రథంలో, పల్లకిలో మంటపంలోకి తీసుకువచ్చారు. వేదపండితులు వాసుదేవాచార్యులు, చక్రపాణి నరసింహమూర్తి కల్యాణం జరిపించారు. కల్యాణ వేడుక తిలకించేందుకు సుమారు 15 వేల మంది భక్తులు హాజరయ్యారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ అంగూరి మహేందర్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్‌ ఎస్సై రవీందర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌/దిలావర్‌పూర్‌

Advertisement
 
Advertisement
Advertisement