కార్మికులు అభివృద్ధి చోదకులు | - | Sakshi
Sakshi News home page

కార్మికులు అభివృద్ధి చోదకులు

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రపంచ అభివృద్ధికి కార్మికులే చోదకశక్తి అని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. కార్మికులు తమ వృత్తులకు సంబంధించి నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉన్నతి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్మిక శాఖ ‘అచీవ్‌మెంట్స్‌, యాక్టివిటీస్‌‘ బుక్‌లెట్‌ ఆవిష్కరించారు. ప్ర వాసీమిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్లకు ప్రతిష్టాత్మక శ్రమశక్తి పురస్కారం ప్రదానం చేశారు. పలువురు కార్మికులను సన్మానించారు. లేబర్‌ కార్డులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ముత్యంరెడ్డి, కార్మిక శాఖ అధికారి రాజలింగు, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, కోటిరెడ్డి, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

చిన్నారుల వికాసానికి బాల భరోసా

శారీరక ఎదుగుదల లోపం ఉన్న చిన్నారుల అనా రోగ్య సమస్యల పరిష్కారానికి బాల భరోసా కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రిలో బాల భరోసాలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అంగన్‌వాడీల్లో విద్యార్థుల్లో ఎదుగుదల లోపాలు గుర్తించిన వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజేందర్‌, సంక్షేమ అధికారి వినూత్న, ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్‌సింగ్‌, ఆర్‌ఎంవో రమేశ్‌, వైద్యులు పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులు రావొద్దు..

జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికా రులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే, అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. పైపులైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సందీప్‌, డీపీవో శ్రీనివాస్‌, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement