నిర్మల్‌చైన్‌గేట్: సెల్లార్లలో ఆస్పత్రులు నిర్వహించొద్దని, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, పొల్యూషన్ బోర్డ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లాలోని పలు ఆస్పత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రుల్లో అర్హత కలిగిన వైద్యులు, సిబ్బంది మాత్రమే పనిచేయాలని తెలిపారు. ప్రతీ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సర్వీస్ చార్జీల బోర్డును డిస్‌ప్లే చేయాలని, రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించాలని వివరించారు. కార్యక్రమలో అధికారులు వెంకట్‌రామ్‌రెడ్డి, సునీల్‌రాజ్, అనిల్ కుమార్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్ పాల్గొన్నారు.


