నిర్మల్: కేంద్ర రోడ్డు, రవాణా జాతీయరహదా రుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని బుధవారం ఢిల్లీలో ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిశారు. జిల్లాలో బాసర నుంచి బి ద్రెల్లి వరకు, దేగాం నుంచి భైంసా వరకు మిగి లిన 161బీబీ జాతీయ రహదారిని ఫోర్‌లేన్ చే యాలని, అలాగే ఈ హైవేను భైంసా మీదుగా మహోర్ వరకూ పొడిగించాలని విన్నవించా రు. రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూ రు చేయాలని, బాసర గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు. మహోర్ వరకు హైవే పొడిగింపు ఫైల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ఉందని, త్వరలో నిధులు మంజూరవుతాయని కేంద్రమంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే రామారావుపటేల్ పేర్కొన్నారు.


