దండేపల్లి: మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండలంలోని నెల్కివెంకటాపూర్, కొండాపూర్, ధర్మరావ్‌పేట, నాగసముద్రం గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


