రెబ్బెన: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన యువకుడు జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులో గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాగజ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అర్భాస్ (18) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాగజ్‌నగర్ మండలంలోని జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత రాని అర్భాస్ ఒక్కసారిగా లోతుగా ఉన్న నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ నీటి నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు భయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెబ్బెన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అర్భాస్ కోసం ప్రాజెక్టు నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు మధ్యలోనే నిలిపివేశారు. గురువారం ఉదయం గాలిస్తామని పోలీసులు తెలిపారు.


