బాసర: ఆర్జీయూకేటీ, బాసర మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల బృందం ‘టీమ్ గరుడ’ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 2వ, 3వ, 4వ సంవత్సరం విద్యార్థుల 30 మంది బృందం రూపొందించిన ఆల్టైరెన్ వెహికల్(ఏటీవీ)తో ఘనత సాధించింది. మార్చి 27 నుంచి 31వరకు నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 55 జట్లు పాల్గొన్నాయి. టీమ్ గరుడ డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ కై వసం చేసుకుంది. కాగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వరకు అహ్మదాబాద్‌లోని మోనార్క్ యూనివర్సిటీలో 43 జట్లు పోటీ పడగా టీమ్ గరుడ అసాధారణ ప్రతిభ కనబరిచి రెండు ప్రధాన అవార్డులు సొంతం చేసుకుంది. డిజైన్ ఎవాల్యుయేషన్ విభాగంలో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ (విన్నర్స్), బెస్ట్ మోటివేటెడ్ టీమ్ అవార్డు గెలుచుకున్నారు. విద్యార్థులను బుధవారం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్, అసోసియేట్ డీన్‌లు కె.మహేశ్, శేఖర్ శీలం, ఎస్.విట్టల్, మెకానికల్ హెచ్‌వోడీ ఎ.చరణ్‌రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు రాహుల్ అభినందించారు.


