నిర్మల్‌చైన్‌గేట్/లోకేశ్వరం: సీ్త్రనిధి కార్యకలాపాల్లో జిల్లా కు రాష్ట్రస్థాయిలో రెండోస్థానం దక్కింది. 2024–25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. సీ్త్రనిధి అమలులో ఉత్తమ ప్రదర్శన కనబరచి లోకేశ్వరం మండల సమాఖ్య ప్రత్యేక అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాదులో శనివారం నిర్వహించిన సీ్త్రనిధి 13వ సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్యవేవరాజన్ చేతుల మీదుగా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, ఏపీడీ, లోకేశ్వరం సమాఖ్య అధ్యక్షురాలు దేవకి, అప్పటి ఏపీఎం మల్లేశ్ అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి ఎండీ తదితరులు పాల్గొన్నారు.


