అంతర్జాతీయ సదస్సులో ఖానాపూర్‌ వాసి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులో ఖానాపూర్‌ వాసి

Mar 29 2026 7:24 AM | Updated on Mar 29 2026 7:24 AM

ఖానాపూర్‌: మండలంలోని గోసంపల్లె కు చెందిన ఎదులా పురం సత్యనారాయణచారి.. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ప్రతి నిధిగా హాజరయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహా రాల మంత్రిత్వ, యువజన సేవల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రపంచ వేదికపై భారత్‌: సాఫ్ట్‌ పవర్‌, విధానాలు, యువ దౌత్యం’అనే అంశంపై మూడు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించారు. విదేశీ వ్యవహారాలశాఖ అదన పు కార్యదర్శి అలోక్‌ దిమిరి కార్యక్రమాన్ని ప్రారంభించగా, నలంద వీసీ సచిన్‌ చతుర్వేది సమక్షంలో సదస్సు జరిగింది. భారత్‌తోపాటు సుమారు పది దేశాల దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్న సదస్సులో సత్యనారాయణ చారి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగా ఇన్‌ఫ్రా సంస్థలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. సత్యనారాయ ణచారిని గోసంపల్లె సర్పంచ్‌ కొక్కుల సుభద్రతోపాటు జిల్లావాసులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement