నిర్మల్‌ బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ బంద్‌ విజయవంతం

Mar 29 2026 7:24 AM | Updated on Mar 29 2026 7:24 AM

● స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన వ్యాపారులు

నిర్మల్‌చైన్‌గేట్‌: కొన్ని రోజులుగా నిర్మల్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు, ఇటీవల వైద్యుడు సంతోష్‌రాజ్‌పై జరిగిన దాడికి నిరసనగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి శనివారం నిర్మల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈమేరకు నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. వ్యాపారులు, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచుకోలేదు. బీజేపీ, బజరంగ్‌దళ్‌ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు.

స్వల్ప ఉద్రిక్తత..

బంద్‌ సందర్భంగా పాత బస్టాండ్‌ వద్ద గందరగోళం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయిస్తుండగా, మరో వర్గంవారు అడ్డుకుని తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు పక్షాలను చెదరగొట్టారు. బంద్‌లో బీజేపీ సీనియర్‌ నాయకులు రావుల రాంనాథ్‌, మెడిసమ్మె రాజు, బీజేపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement