విచక్షణ కోల్పోతున్న మనుషులు
క్షణికావేశంలో దాడులు, హత్యలు
జిల్లాలో ఆగని దారుణ ఘటనలు
చట్టలపై అవగాహన లేనందునే..
‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకై నా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు..’ అంటూ ఓ కవి స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. సందర్భం ఏదైనా నేటి సమాజంలో కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఆప్యాయతలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. అనుమానాలు, వివాహేతర సంబంధాలు, పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు.. కారణలేవైనా అంతిమంగా మానవ మృగాలుగా మారి మనుషులను మనుషులే చంపేసుకుంటున్నారు. మానవ విలువలకు తిలోదకాలిస్తున్నారు.
మంచిర్యాలక్రైం: క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్యను హత్య చేయడం, ఆస్తులకోసం జన్మనిచ్చిన తండ్రిని కొడుకులు, కూతుళ్లు హతమార్చడం లాంటి ఘటనలెన్నో సమాజంలో చూస్తున్నాం. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొంందరు పథకం ప్రకా రం హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడి చట్టం చేతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ.. పోలీసులు టెక్నాలజీ సాయంతో చిన్న ఆధారంతో నైనా నేరస్తులను పట్టుకుని జైలుకు పంపిస్తున్నారు. ఆ తరువాత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి బె యిల్‌పై బయటకు వచ్చినా సమాజం వారిని హంతకులుగా చిన్నచూపు చూస్తుంది. కేసు విచారణ తర్వాత శిక్షలు కూడా పడే అవకాశముంది. బాధిత కుటుంబాలవారే కాకుండా హంతకులకుటుంబాలవారు కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇటీవల జరిగిన మూడు హత్యలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రత్యేక కౌన్సిలింగ్‌తోనే సరి
నేరాల్లో యువత భాగస్వామ్యం ఉండకూడదని పోలీస్‌శాఖ భావిస్తోంది. ఇదే లక్ష్యంతో వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తోంది. యువత, విద్యార్థులకు సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న ఇబ్బందులు, గంజాయి వినియోగం, విక్రయాలతో తలెత్తే సమస్యలను వివరిస్తోంది. ఇదే సమయంలో మానవ సంబంధాలపైనా సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. మహిళలు, మానవ సంబంధాలు, నేరాలు తదితర అసాంఘిక ఘటనల వైపు దృష్టి మళ్లకుండా చూస్తోంది. ఎంతటి సమస్యనైనా కూర్చుండి పరిష్కరించుకునే అవకాశమున్నా ఒకరిలో ఒకరికి తగ్గింపు స్వభావం లేకనే హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీం కోర్టు రాజీ మార్గమే రాజమార్గమని భావించి లోక్ అదాలత్‌ల ద్వారా పెండింగ్ కేసుల్లో కక్షిదారులను రాజీ కుదిర్చేలా చూస్తోంది.
ఇటీవలి ఘటనల్లో కొన్ని..


