భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలను ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు మల్లయోధులు తలపడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన రాజు పటేల్ విజేతగా నిలిచారు. గ్రామ, ఆలయ కమిటీ, ఎస్సై సుప్రియలు విజేతకు ఐదు తులాల వెండి కడియంతోపాటు రూ.6100 నగదు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


