పశువుల రక్షణకు జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పశువుల రక్షణకు జాగ్రత్తలు తప్పనిసరి

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

● వేసవిలో పశువులను ఎక్కువగా బయటకు రానివ్వకుండా పాక (కొట్టం)లోనే ఉండేలా చూడాలి. పాక (కొట్టం) చుట్టూ గోనె సంచులు కట్టి రోజుకు రెండు సార్లు తడపాలి. ● పశువులను దాదాపుగా ఇంటి వద్దనే ఉండేలా చూసి మేత వేయాలి. ఉదయం పూట 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటలకు మేతకు తీసుకెళ్లాలి. ● నీటి తొట్టె (బకెట్‌)లో ఎప్పుడూ శుభ్రమైన నీటినే ఉంచాలి. పశువులను రాత్రి సమయంలో మాత్రం ఆరుబయట ఆవరణలోనే ఉంచాలి. ● వేసవిలో పశువులకు, దూడలకు, ప్రతీరోజు మిశ్రమ దాణాలో పిడికెడు ఉప్పు కలిపి పెట్టాలి. ఎక్కువగా పచ్చి మేతను ఇవ్వాలి. జొన్న, గడ్డిజొన్న, పచ్చి గడ్డి పెంచుకొని పశువులకు వేసవిలో అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి.

రోజురోజుకు పెరుగుతున్న ఎండలు మూగజీవాలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్‌

చెన్నూర్‌రూరల్‌: ఎండలు దంచి కొడుతున్నాయి. రానురాను ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు బాగా ముదిరే అవకాశాలు ఉన్నాయి. ఎండలకు పశువులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్‌ పలు సూచనలు చేశారు.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎండతో అనారోగ్యం

ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పశువులు మేత తినకుండా ఉంటాయి. పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. పశువులు పడు కోవడం తక్కువగా కనిపిస్తుంది. నోటి వెంట సొల్లు కారుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాయి. కళ్లు ఎరుపు రంగులోకి మారి వేడిగా ఉంటాయి. ఈ లక్షణాలు ముదిరితే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వేసవిలో పశువుల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement