కనిపించిన ‘కాటమయ్య’ | - | Sakshi
Sakshi News home page

కనిపించిన ‘కాటమయ్య’

Mar 30 2026 7:25 AM | Updated on Mar 30 2026 7:25 AM

ఖానాపూర్‌: మండలంలోని బావాపూర్‌(కే) గ్రామంలోని గోదావరి తీరంలో పురాతన కాటమయ్య విగ్రహాన్ని గుర్తించారు. కాటమయ్య విగ్రహం కుడిచేతిలో ఖడ్గం ధరించి, తలకు శిరస్త్రాణం పెట్టుకుని, బుగ్గ మీసాలతో, పెద్ద చెవులతో గుర్రంపై స్వారీ చేస్తున్న రూపంలో దర్శనమిస్తోంది. ఈ శిల్పం కొంత భాగం భూమిలో దిగబడిన స్థితిలో ఉంది. విగ్రహం పక్కనే ఎల్లమ్మగా పూజించబడుతున్న మరో శిలను కూడా గుర్తించారు. స్థానిక విశ్వాసాల ప్రకారం కాటమయ్య పశువుల మందలను రక్షించే దేవుడిగా భావిస్తారు. ఈ శిల్పం 18 శతాబ్దానికి చెందినదిగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. ఇక్కడ ప్రాంతీయ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై మరింత పరిశోధన అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement