కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన దేవిదాస్, కాంతారావు పటేల్‌లు మొక్కజొన్న పంటను కోసి ఆరబెట్టారు. పంట చేనుపై వేలాడుతున్న విద్యుత్ తీగల నుంచి నిప్పు రవ్వలు పంటపై వచ్చి పడడంతో ప్రమాదం జరిగిందని రైతులు పేర్కొన్నారు. రైతు దేవిదాస్ 5ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఎకరంన్నర మక్క దగ్ధం కాగా రూ.90వేలు, కాంతారావు పటేల్ 6 ఎకరాల్లో సాగుచేయగా 2 ఎకరాల్లో మక్క దగ్ధం కాగా రూ.1 లక్ష 35 వేలు నష్టం వచ్చిందని బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని వారు కోరారు.


