రాజీతో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

రాజీతో సత్వర న్యాయం

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్‌ 28న జాతీయ లోక్‌ అదాలత్‌ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలంటున్న ఎస్పీ

వాహన ప్రమాదాల వివాదాలు

చీటింగ్‌ ఫిర్యాదులు

శారీరక గొడవలు

దాంపత్య సమస్యలు, విడాకులు

స్వల్ప దొంగతనాలు

కరోనా లాక్‌డౌన్‌ కేసులు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఉల్లంఘనలు

ఇతర రాజీపడదగిన విషయాలు

నిర్మల్‌ టౌన్‌: తెలిసో, తెలియకో చేసిన తప్పులకు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నవారు రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించుకునే అవకాశాన్ని లోక్‌ అదాలత్‌ కల్పిస్తోంది. రాజీ మార్గంలో ఇరు వర్గాలకు ఇందులో న్యాయం జరుగుతోంది. వివాదాలను సామరస్యంగా ముగించే గొప్ప వేదిక లోక్‌ అదాలత్‌.

జిల్లా వ్యాప్త నిర్వహణ

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ కోర్టుల్లో ఈనెల 28న శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నారు. ఆయా కోర్టుల్లో పెండింగ్‌ కేసులతోపాటు విచారణ దశలో ఉన్న సమస్యలను ఒకే రోజులో పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

హాజరయ్యే విధానం

ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ సంబంధిత కోర్టులో హాజరు కావాలి. ఆధార్‌ కార్డు తప్పనిసరి. హాజరైన వెంటనే రాజీ ప్రక్రియ పూర్తి చేసి కేసు ముగించుకోవచ్చు. ఒకే రోజు పరిష్కారం లభిస్తుంది. ఏళ్లుగా కోర్టు వాయిదాలకు తెరపడుతుంది. ఫార్మల్‌ విచారణ లేకుండా సులభంగా పరిష్కారం లభిస్తుంది.న్యాయ ఫీజులు, ఖర్చులు ఆదా అవుతాయి. తక్కువ ఖర్చుతో శాంతియుత ముగింపు లభిస్తుంది.

రాజీ చేసుకునే కేసులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement