లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రామంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుంజర యాత్ర పేరిట కిమ్స్, సన్‌షైన్ ఆస్పత్రులకు చెందిన ప్రఽముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డా.విమలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. 420 మందికి రక్త పరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, షుగర్, బీపీ, గుండెకు సంబంధించి ఈసీజీ, 2డీ ఈకో వంటి 10 రకాల పరీక్షలు ఉచితంగా చేశారు.
సొంత గ్రామంలో....
కుంజర యాత్రలో భాగంగా ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో ఉచిత వైధ్య శిబిరాలు నిర్వహిస్తున్న డా.విమలాకర్‌రెడ్డి శనివారం తన స్వగ్రామం వడ్యాల్‌లో నిర్వహించారు. సొంత గ్రామ ప్రజలతోపాటు, మండల ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్‌ను గుర్తించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కుంజర యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరేశ్, గ్రామ కోశాధికారి సల్ల రాజేంద్రప్రసాద్, వీడీసీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


