ఉత్తమ అటవీ అధికారిగా నజీర్‌ఖాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ అటవీ అధికారిగా నజీర్‌ఖాన్‌

Mar 22 2026 6:03 AM | Updated on Mar 22 2026 6:03 AM

సారంగపూర్‌: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ అటవీశాఖ అధికారిగా సారంగాపూర్‌ వెస్ట్‌ జోన్‌ డెప్యూటీ రేంజ్‌ అధికారి ఎండీ.నజీర్‌ఖాన్‌ ఎంపికయ్యారు. ఈనెల 23న తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రెటరీ అహ్మద్‌ నదీమ్‌, ఐఎఫ్‌ఎస్‌ సువర్ణల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. అటవీ సంరక్షణ, వణ్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు గుర్తింపుగా ఈఅవార్డు తనకు దక్కిందని నజీర్‌ఖాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement