న్యూస్‌రీల్
ఎమ్మెల్యేను కలిసిన
ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు
భైంసా: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థి సంఘం నాయకులు శనివారం కలిశారు. తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ట్రిపుల్‌ఐటీ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్‌ఐటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని టీఎస్‌ఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర నాయకుడు ఆకాశ్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఏఎస్ జిల్లా అధ్యక్షుడు కదం కేశవ్‌పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు.


