మంచిర్యాలటౌన్: మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పండగల పూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతలు చేపట్టడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ టాకీస్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పులో భాగంగా చేపడుతున్న కూల్చివేతలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్ష, వ్యాపారులపై కోపంతో కూల్చివేయడం దారుణమని, రాజకీయ ప్రోద్బలంతో మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. మంచిర్యాల నగర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రతి ఏటా పండుగల సమయంలోనే కూల్చివేతలను జరపడం దారుణమని తెలిపారు.


