సారంగపూర్: మండలంలోని ధని గ్రామానికి చెందిన వడ్డి దేవేందర్‌రెడ్డి(50) అమెరికాలోని జార్జియాలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెదాడు. ఆయన సోదరుడు వడ్డి రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవేందర్‌రెడ్డి అమెరికాలోని జార్జియాలో సూపర్‌మార్కెట్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కూతురు, అల్లుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి అతడిని అమెరికాకు తీసుకుని వచ్చారు. ఆయన అమెరికాలోని జార్జియాలో ఉంటూ సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాడు. పనులు ముగించుకుని నివాసానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.


