జైపూర్: మండలంలోని శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వారం గ్రామానికి చెందిన గెల్లు సారక్క, లంబు సంపత్‌రెడ్డిల గేదెలు గురువారం మేత కోసం శివ్వారం అటవీ ప్రాంతం వెపు వెళ్లాయి. వేసవికాలం కావడం చెరువులో నీరు తాగడానికి అక్కడికి వెళ్లిన రెండు గేదెలను మొసళ్లు నోటితో కరిచి లోపలికి లాక్కెళ్లి దాడి చేసి చంపాయి. శుక్రవారం స్థానికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతి చెందిన ఒక్కో గేదె విలువ రూ.60 వేల ఉంటుందని బాధితులు తెలిపారు. అటవీ అధికారులు ఘటన స్థలాని కి చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారులు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎర్ర చెరువులో మొసళ్ల ఉన్నట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు పశువులు, మనుషులపై మొసళ్లు దాడి చేసిన ఘటన లేదు. ఇదే తొలిసారి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.


