నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే 6 మైన్‌క్లోజర్ పనులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గనిలో గత కొన్నినెలల క్రితం బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. గని పూర్తిస్థాయి మూసివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం మైన్ క్లోజర్ పనులు కొనసాగుతున్నాయా లేదా అని జీఎం తనిఖీ నిర్వహించారు. మైన్ ప్రారంభానికి ముందు ఎలాంటి సాధారణ పరిస్థితులు ఉన్నాయో మూసివేత అనంతరం అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పాటు చేయాల్సిందని సిబ్బందికి సూచించారు. గని ప్రాంగణంలో విరివిగా మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు. ఆర్కే 5,6 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్ ఉన్నారు.


