ఉట్నూర్‌రూరల్: పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉట్నూర్ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని శంకర్‌తండాకు చెందిన జాదవ్ శ్రీనివాస్ మద్యం తాగి బైక్‌పై రాగా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి
మందమర్రిరూరల్: మండలంలోని మామిడిగట్టులో విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతు గుడికందుల భూమయ్యకు చెందిన ఆవు గురువారం ఉదయం మేతకు వెళి్‌ల్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా చెరువు పక్కన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. పశువైద్యాధికారి తిరుపతి శుక్రవారం ఆవును పరిశీలించారు. దీని విలువ రూ.55 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. రెండురోజుల క్రితం సారంగపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌తో గేదె మృతిచెందిన విషయం తెలిసిందే.


