బజార్‌హత్నూర్: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి బాల వాటిక 1, 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 2న రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలా బాద్, మంచిర్యాలలో విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలతో పాటు విద్యాహక్కు చ ట్టం కింద కూడా ఇతర పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రెండు సెక్షన్‌లలో 40 మంది విద్యార్థుల చొ ప్పున 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన ఉంటుంది. తరగతి1లో అడ్మిషన్ పొందే విద్యార్థి 2026 మార్చి 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హులైన విద్యార్థులు kvsonline admission.kvs.gov. in లేదా kvssangathan. nic.in వెబ్‌సైట్ ద్వా రా లాగిన్ కావాలి. బా లవాటిక 2, బాలవాటి క 3, రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


