బాలికా విద్యకు మరింత భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు మరింత భరోసా

Mar 18 2026 7:40 AM | Updated on Mar 18 2026 7:40 AM

● మూడు కేజీబీవీలు వైఐఐవోఈలుగా ఎంపిక

లక్ష్మణచాంద: రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను మరింత బలోపేతం చేస్తూ కార్పొరేట్‌ కళాశాలలతో పోటీపడగల నాణ్యమైన జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని 18 కేజీబీవీల్లో మూ డింటిని యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (వైఐఐఓఈ) కళాశాలలుగా ఎంపిక చేసింది. ఇవి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా తయారు చేయనున్నాయి.

దరఖాస్తు వివరాలు

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేజీబీవీల సెక్టోరియల్‌ అధికారి నవీనజ్యోతి ఈ విషయాన్ని ప్రకటించారు. లక్ష్మణచాంద కేజీబీవీలో బైపీసీ, దిలావా ర్‌పూర్‌ కేజీబీవీలో ఎంపీసీ, నిర్మల్‌ అర్బన్‌ కేజీబీ వీలో సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ కాలేజీలో 40 చొప్పున మూడు గ్రూపుల్లో సీట్లు ఉన్నాయి ఎంపికై న విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులతోపాటు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.

ప్రత్యేక శిక్షణ, సదుపాయాలు

ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులకు నీట్‌, జేఈఈ, క్లాట్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. ప్రతీ కళాశాలకు 40 కంప్యూటర్లు, 200 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ వేగం అందుబాటులోకి తెచ్చారు. లక్షల రూపాయలు ఖర్చుతో అధునాతన గ్రంథాలయం, 16 రకాల తెలుగు అకాడమీ పుస్తకాలు సమకూర్చారు. నిపుణులు బోధించేలా ఏర్పాట్లు చేశారు.

తరగతి షెడ్యూల్‌

శని, ఆదివారాలు పూర్తి రోజు తరగతులు, మిగిలిన రోజులు సాయంత్రాల్లో ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారు. ఈ కళాశాలలు బాలికలకు ఉన్నత విద్యలో పోటీస్థాయి చేరే అవకాశాన్ని కల్పిస్తాయిఙ

దరఖాస్తు చేసుకోవాలి..

వచ్చే విద్యాసంవత్సరం 2026–27 నుంచి జిల్లాలోని మూడు వైఐఐవోఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ కేజీబీవీలలో నీట్‌, క్లాట్‌, జేఈఈ, ఐఐటీ వంటి పోటీపరీక్షలపై విద్యార్థులకు నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ కళాశాలలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం.

– నవీనజ్యోతి, కేజీబీవీ సెక్టోరియల్‌ అధికారి

జిల్లా సమాచారం...

మొత్తం కేజీబీవీలు 18

వైఐఐవోఈకి ఎంపికై న కేజీబీవీలు 03

నీట్‌ : లక్ష్మణచాంద

జేఈఈ : దిలావర్‌పూర్‌

క్లాట్‌ : నిర్మల్‌ అర్బన్‌ కేజీబీవీ

దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌

http/tgrjc.gov.in

దరఖాస్తు రుసుం రూ.200

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement