పట్టభద్రులు పల్లె పాలకులు
న్యూస్‌రీల్
నిర్మల్
ఆధ్యాత్మిక శోభితం
ఆధ్యాత్మిక మాసాల్లో ధనుర్మాసానికి ప్రత్యేక మాసంగా పేరుంది. ధనుర్మాసోత్సవాలు మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14 భోగి రోజున ముగుస్తుంది.
క్లాస్ మేట్స్..
సర్పంచ్, ఉప సర్పంచ్
దిలావర్‌ఫూర్: మండల కేంద్రమైన దిలావర్‌పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌గా క్లాస్‌మేట్స్ ఎన్నికయ్యారు. ఇద్దరూ ఉన్న త విద్యావంతులు. సర్పంచ్‌గా పాల్దె అక్షర గెలిచారు. ఈమె ఎమ్మెస్సీ బీఈడీ పూర్తిచేశారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచారు. మూడేళ్లు ఎంపీపీగా పనిచేశారు. గ్రామానికి చెందిన నడుకుడ సుఖేశ్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇతను ఎంఈడీ పూర్తిచేశాడు. ప్రైవేటు విద్యాసంస్థ నడుపుతున్నాడు. సర్పంచ్ అక్షర, ఉప సర్పంచ్ ఇద్దరూ పదో తరగతి వరకు క్లాస్‌మేట్స్. దిలావర్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. దిలావర్‌పూర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్నూరు కాపు సంఘం జిల్లా సభ్యులు సోమవారం సన్మానించారు.
లక్ష్మణచాంద: రాజకీయాలంటే ఈ రోజుల్లో చదువుకున్నవారు దూరంగా ఉంటారు. జాబ్ చేసుకోవాలి.. కుటుంబాన్ని చూసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ, జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యువకులు, గ్రాడ్యుయేట్లు బరిలో దిగారు.. నిలబడి.. కలబడి గెలిచారు. గ్రామాల సేవ చేయాలనే సంకల్పంతో పలు గ్రామాల్లో విద్యావంతులు, యువకులు సర్పంచులుగా విజయం సాధించారు. ఈ నెల 11, 14 తేదీల్లో మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో, రెండో విడతలో నిర్మల్ రూరల్, లోకేశ్వరం, కుంటాల, సారంగాపూర్, దిలావర్‌పూర్, సోన్, నర్సాపూర్(జి) మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచులుగా గ్రామ అభివృద్ధిపై తమకు స్పష్టత ఉందని పేర్కొంటున్నారు.
సర్పంచ్ పాల్దె అక్షర
ఉప సర్పంచ్ సుఖేశ్
ప్రజలకు న్యాయం చేయాలి..
కుంటాల: కుంటాలకు చెందిన జక్కుల గజేందర్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంబీఏ ఫైనాన్స్, ఎల్‌ఎల్‌బీ(ఎల్‌ఎల్‌ఎం) పూర్తి చేశాడు. హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచాడు. భారీ మెజారిటీతో విజయం సాధించాడు. సర్పంచ్‌గా గ్రామ ప్రజలకు, పదవికి న్యాయం చేస్తానని పేర్కొంటున్నాడు.
– జక్కుల గజేందర్, సర్పంచ్, హైకోర్టు న్యాయవాది
పట్టభద్రులు పల్లె పాలకులు
పట్టభద్రులు పల్లె పాలకులు
పట్టభద్రులు పల్లె పాలకులు
పట్టభద్రులు పల్లె పాలకులు


