అండర్ టన్నెల్ పనులు పరిశీలన
న్యూస్‌రీల్
ఖానాపూర్: మండలంలోని రాజూర, సింగాపూర్, మందపల్లి, పెంబి తదితర గ్రామాలకు సాగునీరు అందించే డీ–28 కాలువకు రాజూరా–సింగాపూర్ గ్రామాల మద్యలో ఇటీవల గండిపడింది. రైతుల విన్నపం మేరకు గండిపడిన ప్రాంతంలో అండర్ టన్నెల్ నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరయ్యాయి. దీంతో గండిపడిన ప్రాంతంలో చేపట్టిన అండర్ టన్నెల్ పనులను ఆయా గ్రామాల రైతులతో కలిసి రాజూర సర్పంచ్ చేగంటి మల్లేశ్ ఆదివారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టడంతోపాటు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు నీరటి చిలుకలయ్య, గాజర్ల భూమన్న, దావుల ముత్యం, లింగాల అంజన్న, కొమురేష్ తదితరులు పాల్గొన్నారు.
17న బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అకాడమీలో జిల్లాస్థాయి సీనియర్స్ బాల, బాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు ఈనెల 17న నిర్వహిస్తామని బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ చందుల స్వామి తెలిపారు. జనవరి 1985 నుంచి 31 డిసెంబర్ 2006 మధ్యలో జన్మించినవారు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌తో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇందులో ఎంపికై న వారు ఈనెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 9966677105 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


