పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నిర్మల్ రూరల్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం పరిశీలించారు. నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ కేంద్రాన్ని కలెక్టర్, తలువేదా, లంగాడాపూర్, వెంగవాపేట్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మస్రత్ ఖానం పరిశీలించారు. వీరి వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో గజానన్ ఉన్నారు.
ప్రశాంతంగా రెండో విడత పోలింగ్
నిర్మల్‌టౌన్/కుంటాల: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. అంతకుముందు కుంటాల మండలం కల్లూరు, ఓలా, కుంటాల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్‌ఖానంతో కలిసి పరిశీలించారు. వారివెంట భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ నైలు ఉన్నారు.


