● మూడు ఓట్లతో విజయం
జ్యోతిబాయిని
వరించిన అదృష్టం!
కుంటాల: మండలంలోని అంబకంటి తండాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన జాదవ్ జ్యోతిబాయికి అదృష్టం వరించింది. పంచాయతీ పరిధిలో 467 ఓట్లు ఉండగా 406 ఓట్లు పోలయ్యాయి. 203 ఓట్లు జాదవ్ జ్యోతిబాయికి రాగా, ప్రత్యర్థి రాథోడ్ మీ రాబాయికి 200 ఓట్లు వచ్చాయి. ఇందులో మూ డు చెల్లని ఓట్లు ఉన్నాయి. ఒకవేళ చెల్లని ఓట్లు ప్రత్యర్థికి పడితే డ్రా తీసే పరిస్థితి ఉండేది. మూ డు ఓట్లతో జ్యోతిబాయి విజయం సాధించింది.


