మహిళలదే పైచేయి..
ఓట్లపరంగా ఎక్కువగా ఉన్న మహిళలు ఓటేయడంలోనూ ఆధిక్యం కనబర్చారు. తొలివిడతతోపాటు ఈసారి కూడా అధికసంఖ్యలో ఓట్లేశారు. ఏడు మండలాల్లో ఏకగ్రీవమైన గ్రామాలు మినహాయించగా మొత్తం 1,65,919 ఓటర్లు ఉండగా, 1,37,162 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 77,501గానూ 60,909 మంది ఓటేశారు. 16,592 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మహిళలు మొత్తం 88,415 మంది ఉండగా, 76,252 మంది ఓటేశారు. 12,163 మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఇతర ఓటర్లు ముగ్గురు ఉండగా ఒక్కరే ఓటేశారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తమ స్వగ్రామమైన నిర్మల్‌రూరల్ మండలం ఎల్ల పెల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జెడ్పీచైర్‌పర్సన్ శోభారాణి, సత్యనారాయణగౌడ్ దంపతులు స్వగ్రామం సోన్ మండలం కడ్తాల్‌లో ఓటేశారు.


