ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
లోకేశ్వరం/కుంటాల: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. లోకేశ్వరంలో ఎన్నికల ఏర్పాట్లను, కుంటాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోలీంగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని కోరారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, నోడ ల్ అధికారి అంబాజీ,జిల్లా ఎన్నికల అదనపు అధి కారి అల్లాడి వనజ, ఎంపీడీవో రమకృష్ణ, ఎంపీవోలు సోలమన్‌రాజ్, రహీంఖాన్, లోకేశ్వరం మండల పరిషత్ సూపరింటెండెంట్ వెంకటరమేశ్, మాస్టర్ ట్రైనీ దేవేందర్, మురళీధర్, కుంటాల తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంఈవో ఉన్నారు.


