ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
లోకేశ్వరం/కుంటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకో వాలని ఏఎస్పీ రాజేశ్‌మీనా సూచించారు. లోకేశ్వరం, కుంటాల పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు కేటాయించిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. పలు సూచలు చేశారు. ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు. గ్రామాల్లో అల్లర్లు జరుకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కేంద్రం వద్ద 200 మీటర్ల దూరం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. ముథోల్, భైంసా రూరల్ సీఐలు మల్లేశ్, నైలు, ఎస్సైలు ఆశోక్, శంకర్, కృష్ణారెడ్డి, జుబేర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


