పల్లెల్లో పార్టీల ఫైట్
న్యూస్‌రీల్
నిర్మల్
పల్లె పాలనకు 61 ఏళ్లు
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి 61 ఏళ్లు అవుతుంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.
సమస్యలు పరిష్కరించేలా అభివృద్ధి పనులు
భైంసాటౌన్: పట్టణంలో సమస్యలు ఉన్నచోట అభివృద్ధి పనులు చేపట్టాలని భైంసా సబ్ కలెక్టర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ అజ్మీర సంకేత్‌కుమార్ మున్సిపల్ అధికారులను సూచించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. పంజేషాచౌక్ నుంచి వినాయక నిమజ్జనం రూట్‌లో సమస్యలు పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో ఇరుకు మార్గాల్లో డ్రెయినేజీలపై స్లాబ్ నిర్మించాలని సూచించారు. స్థానిక కమల థియేటర్ నుంచి వివేకానంద చౌక్ వరకు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీలు పరిశీలించారు. రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనల మేరకు పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈఈ సంతోష్, టీపీవో అనురాధ, సిబ్బంది ఉన్నారు.
నిర్మల్: సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకున్నా.. పార్టీ లకు పల్లెపోరు ప్రతిష్టాత్మకంగానే మారింది. తాము బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ సీరియస్‌గా పనిచేస్తున్నాయి. డీసీసీ పదవి చేపట్టిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని పంచాయతీలోనూ గెలిపించుకుందామంటూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ చేరికలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో పట్టుపెంచుకునే పనిలో పడింది. ఇక గత ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న బీఆర్‌ఎస్ ఈసారి అంతగా ప్రభావం చూపడం లేదు.
ఇది గుర్తింపు పోరాటం..
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. కానీ.. అభ్యర్థులు దాదాపు ఏదో ఒకపార్టీకి చెందినవారే ఉంటారు. ఇక పార్టీలు తమ గుర్తులు లేకున్నా.. గుర్తింపు కోసం పల్లెపోరులో ఫైట్ చేస్తున్నాయి. గ్రామీణ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఏ ఎన్నికల్లోనైనా ఈ ఓట్లే కీలకం. సర్పంచులు చాలావరకు గ్రామాలను ప్రభావితం చేయగలుగుతారు. పార్టీని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్తారు. ఈనేపథ్యంలోనే పార్టీలు పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తాము బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
కాంగ్రెస్–బీజేపీ ఫైట్.. కారు సైలెంట్..
జిల్లాలో 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సత్తా చాటింది. మూడొంతుల పంచాయతీల్లో తాము బలపర్చినవారినే సర్పంచులుగా గెలిపించుకుంది. కానీ.. ఇప్పుడు సీన్‌మారింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, జిల్లాలో పెద్దనేతలందరూ పార్టీలు మారడంతో ప్రస్తుతం నామమాత్రంగా బరిలో దిగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు బలపర్చిన అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తోంది. జిల్లాలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండటం, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఆపార్టీ పల్లెల్లో విస్తరిస్తోంది. చేరికలను ప్రోత్సహిస్తోంది. ఇక అధికారంలో కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవలే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి పొందిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.
‘విజయం’వైపు పయనం..
ఓవైపు పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే, చాలామంది అభ్యర్థులు మాత్రం తాము ఎక్కడుంటే గెలుస్తామన్నట్లుగా ఆలోచిస్తున్నారు. తమ గ్రామాల్లో పరిస్థితులు, పార్టీల ప్రభావాలను లెక్కేసుకుంటున్నారు. గెలిచిన తర్వాత ఎటైతే అటు కానీ.. ముందైతే గెలువాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.
పల్లెల్లో పార్టీల ఫైట్


