సామర్థ్యాలను పరిశీలించి.. విద్యార్థులను అభినందించి..
నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక పాఠశాల, కస్బా ఉన్నత పాఠశాలను వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి సోమవారం సందర్శించారు. శాంతినగర్ పాఠశాలలో విద్యార్థుల తొలిమెట్ట సామర్థ్యాలను పరిశీలించారు. త్వరలో జరిగే ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్) గురించి వివరించి, అందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలు పరీక్షించి ప్రశంసించారు. కస్బా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న విద్య కార్యక్రమాల గురించి ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.


