పాఠశాలను సందర్శించిన ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్
మామడ: మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ట్రెయినీ డిప్యూ టీ కలెక్టర్ రాకేశ్ సోమవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులు అందిస్తున్న మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలని సూచించారు. పాఠశాలలో అమలవుతున్న బాలశక్తి, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు, ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్, మిడ్‌లైన్ పరీక్షల రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌ను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


