మత్తుతో జీవితం నాశనం
లక్ష్మణచాంద:మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం అవుతాయని మిషన్ పరివర్తన్ – నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, విద్యార్థుల భవిష్యత్తుపై వాటి ప్రభావాలను వివరించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సామాజిక సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు ఇలాంటివాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఇలియాస్, సోషల్ వర్కర్ పుట్టి అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు.
గజ్జలమ్మకు పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి నిర్వహించారు. పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
అడెల్లి మహా పోచమ్మకు వెండి కిరీటం
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మకు నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడకు చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రేమలత–రాజేశ్వర్‌గౌడ్ దంపతులు ఆదివారం వెండి కిరీటం బహూకరించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని కిరీటాన్ని అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేవారు. అనంతరం కిరీటాన్ని ఈవో భూమయ్యకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మత్తుతో జీవితం నాశనం
మత్తుతో జీవితం నాశనం


