సంఘ కార్యమే ధర్మకార్యం
కుభీర్: ఆరెస్సెస్ వందేళ్ల వేడుకల్లో భాగంగా కుభీర్‌లో స్వయం సేవకులు ఆదివారం పథసంచలన్ నిర్వహించారు. సమావేశానికి విభాగ్(నాలుగు జిల్లాలు) ప్రచారక్ నర్ర వెంకటశివకుమార్ హాజరై మాట్లాడారు. హిందువుల ఐక్యత కోసం డాక్టర్ కేశరావ్ బిలిరాం పంత్ హెడ్గేవార్ 1925లో ఆరెస్సెస్‌ను ప్రారంభించారన్నారు. సంస్థ కార్యకలాపాలు నేడు 75 దేశాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దానికి అనుబంధంగా 44 అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయని వివరించారు. ఐదుగురితో ప్రారంభమైన సంఘంలో నేడు కోట్లాదిమంది కార్యకర్తలు ఉన్నారన్నారు. సంఘ కార్యమే ధర్మకార్యమన్నారు. దేశాన్ని ధర్మాన్ని కాపాడటమే ఆరెస్సెస్ ధ్యేయమన్నారు. ప్రపంచంలో ఏశక్తి ఆరెస్సెస్‌ను ఏమీ చేయలేదన్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆరెస్సెస్‌పై నిషేధం విధించిందని తెలిపారు. కోర్టు దానిని రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘ చాలక్ సాదుల కృష్ణదాస్, ముఖ్య అథితి రెడిశెట్టి సంతోష్‌సేట్, జిల్లా కార్యవాహ అరుణ్, జిల్లా శారీరక్ ప్రముఖ్ హన్మాండ్లు, జిల్లా సేవాప్రముఖ్ అడెపు శ్రీనివాస్, జిల్లా కార్యకారిణి సభ్యులు దామోదర్, ఖండ కార్యవాహ గణేశ్, ఖండసహ కార్యవాహ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.


